TS EAMCET : జూలై 16న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

హైదరాబాద్ (జూలై – 14) : TS EAMCET ENGINEERING COUNSELING PHASE 1 SEATS ALLOTMENT జులై 16, 2023 చేయనున్నట్లు సమాచారం. కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో ఫలితాలను తెలుసుకోవచ్చు.

అయితే అలాట్మెంట్ ఫలితాలను ప్రాసెస్ చేయడానికి అధికారిక వెబ్సైట్ లోని కొన్ని విభాగాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాట్మెంట్ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి తిరిగి వెబ్సైట్లోని అన్ని విభాగాలను అందుబాటులోకి
తీసుకురానున్నారు.

అలాట్మెంట్ జాబితాలో అభ్యర్థులు వారికి కేటాయించిన కళాశాల, కోర్సుకు సంబంధించిన సమాచారం ఉంటుంది. విద్యార్థులు ఈ ఆర్డర్ పొందిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ కు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

◆ వెబ్సైట్ : eamcet.tsche.ac.in