హైదరాబాద్ (ఫిబ్రవరి – 04) : తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2023) షెడ్యూల్ ఫిబ్రవరి 6న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి తెలిపారు. దీంతో పాటు ఈ-సెట్, ఐ-సెట్, పీజీ సెట్, ఎడ్ సెట్ షెడ్యూళ్లను కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ పై విద్యార్థులు ఆసక్తితో ఉన్నారు. ఇప్పటికే జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష జేఈఈ తొలివిడత పూర్తయింది. రెండోవిడత ఏప్రిల్లో జరుగుతుంది. ఈలోగా ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి. ఎంసెట్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత పరీక్షకు 45 రోజుల గడువు ఉండాలనిమండలి నియమంగా పెట్టుకుంది. ఈ కారణంగా ఏప్రిల్ చివరివారం లేదా మే మొదటివారంలో పరీక్ష ఉండొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఇంటర్ వెయిటేజీ దాదాపు ఉండనట్టేనని అధికారులు చెబుతున్నారు.
Follow Us @