హైదరాబాద్ (మార్చి – 31) : తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2023) పరీక్ష షెడ్యూల్ లో మార్పులు చేస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.
మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
నీట్, టీఎస్ పీఎస్సీ నిర్వహించే పరీక్షల కారణంగా షెడ్యూల్ లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.