TS EAMCET FINAL & SPECIAL PHASE COUNSELING : ఎంసెట్ షెడ్యూల్

హైదరాబాద్ (ఆగస్టు – 03) : తెలంగాణ ఎంసెట్ తుది దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆగస్టు 4 నుండి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో సీట్ల కేటాయింపును ఆగస్టు 9వ తేదీన జరపనున్నారు. రెండో దశ సీట్ల కేటాయింపు పూర్తయిన తర్వాత 12,013 ఇంజనీరింగ్ సీట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. వీటిని తుదిదశ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. (TS EAMCET 2023 FINAL & SPECIAL PHASE COUNSELING SCHEDULE)

ఈసారి తుది విడత కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ప్రత్యేక విడత కౌన్సిలింగ్ ను కూడా చేపట్టనున్నారు.

తుది విడత కౌన్సెలింగ్ లో స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోట సీట్లను భర్తీ చేయనున్నారు కావున అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చు. అలాగే స్పాట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ఆగస్టు 23వ తేదీన విడుదల చేయనున్నారు.

★ తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్

రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, ఫీజు : ఆగస్టు – 04

సర్టిఫికెట్ వెరిఫికేషన్ : ఆగస్టు – 05

వెబ్ ఆఫ్షన్స్ : ఆగస్టు – 04 నుంచి 06 వరకు

సీట్ల కేటాయింపు : ఆగస్టు – 09

ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ప్ రిపోర్టింగ్ : ఆగస్టు – 09 నుంచి 11

కళాశాల లో రిపోర్టింగ్ : ఆగస్టు – 12

★ ప్రత్యేక విడత కౌన్సిలింగ్ షెడ్యూల్

రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, ఫీజు : ఆగస్టు – 17

సర్టిఫికెట్ వెరిఫికేషన్ : ఆగస్టు – 18

వెబ్ ఆఫ్షన్స్ : ఆగస్టు – 17 నుంచి 19 వరకు

సీట్ల కేటాయింపు : ఆగస్టు – 23

ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ప్ రిపోర్టింగ్ : ఆగస్టు – 23 నుంచి 25

కళాశాల లో రిపోర్టింగ్ : ఆగస్టు – 23 నుంచి 25

◆ వెబ్సైట్ : https://tseamcet.nic.in/default.aspx