హైదరాబాద్ (ఆగస్టు 09) : తెలంగాణ ఎంసెట్ 2023 ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ సీట్లను (ts eamcet 2023 final phase seat allotment today) ఈరోజు కేటాయించనున్నారు.
★ కళాశాలలో రిపోర్ట్ గడువు ఆగస్టు 12
మొదటి, తుది విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 10 నుంచి 12 వరకు కాలేజీలకెళ్లి రిపోర్ట్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ అధికారులు సూచించారు. విద్యార్థి జిరాక్స్ సర్టిఫికెట్లను, ఒరిజినల్ టీసీని సీటు వచ్చిన కాలేజీలో సమర్పించాలని వెల్లడించారు. విద్యార్థులు రిపోర్ట్ చేయని పక్షంలో సీటు ఆటోమెటిక్ గా రద్దవుతుందని తెలిపారు.
★ ఆగస్టు 17 నుండి స్పెషల్ ఫేజ్
స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఆగస్టు 17 నుంచి ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. వెబ్ ఆప్షన్లు ఎంచుకొన్న వారికి ఆగస్టు 23 లోపు సీట్లను కేటాయిస్తారు. 25 లేదా అంతకుళముందే కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.