TS EAMCET SPECIAL PHASE COUNSELING : నేటి నుండి ప్రారంభం

హైదరాబాద్ (ఆగస్టు – 17) : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో పలు ఇంజనీరింగ్ కోర్స్ లలో ప్రవేశాల కోసం స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ (TS EAMCET 2023 ENGINEERING SPECIAL PHASE COUNSELLING SCHEDULE) నేటి నుండి ప్రారంభం కానుంది.

వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లు నూతన కళాశాల ఏర్పాటు వలన ఏర్పడిన సీట్లలో కోసం ఈ కౌన్సిలింగ్ ను నిర్వహించనున్నారు.

ఈ ప్రత్యేక దశ కౌన్సిలింగ్ ద్వారా 19,049 సీట్ల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. ఆగస్టు 17న కౌన్సిలింగ్ ప్రారంభం కాగా, ఆగస్టు 23న సీట్ల కేటాయింపు చేయనున్నారు.

ఇంటర్నల్ స్లైడింగ్ మరియు స్పాట్ అడ్మిషన్లు ను ఆగస్టు 23వ తేదీన చేపట్టనున్నారు. ఇది కేవలం ప్రైవేటు అన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలు మరియు బీ ఫార్మాసీ కళాశాలలో మాత్రమే చేపట్టనున్నారు.

◆ TS EAMCET 2023 ENGINEERING SPECIAL PHASE COUNSELLING SCHEDULE

  • రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, ఫీజు : ఆగస్టు – 17
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ : ఆగస్టు – 18
  • వెబ్ ఆఫ్షన్స్ : ఆగస్టు – 17 నుంచి 19 వరకు
  • సీట్ల కేటాయింపు : ఆగస్టు – 23
  • ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ సెల్ప్ రిపోర్టింగ్ : ఆగస్టు – 23 నుంచి 25
  • కళాశాల లో రిపోర్టింగ్ : ఆగస్టు – 23 నుంచి 25

◆ వెబ్సైట్ : https://tseamcet.nic.in/default.aspx