హైదరాబాద్ (ఆగస్టు – 09) : TS EAMCET 2023 FINAL PHASE ENGINEERING SEATS కేటాయింపు చేశారు. తుది విడుత సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత ఇంకా 13,139 బీటెక్ సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు.
సివిల్, మెకానికల్ కోర్సుల్లో 4,730 సీట్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో మరో 4,150 సీట్లు, సీఎస్‌ఈ, ఐటీ కోర్సుల్లో 3,777 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఈ కేటాయింపు పూర్తయ్యాక, మొత్తంగా 83,766 బీటెక్ సీట్లుంటే, 70,627 సీట్లు (84.31శాతం సీట్లు) నిండాయి. రెండో విడుత కౌన్సెలింగ్‌లో 62,738 విద్యార్థులు సీట్లను కన్ఫర్మేషన్ చేసుకోగా, తాజాగా 7,889 మంది విద్యార్థులకు తుది విడుత కౌన్సెలింగ్‌లో సీట్లను దక్కించుకున్నారు. సీట్లు దక్కించుకున్న విద్యార్థులు ఈ నెల 11లోగా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అంతేకాకుండా ఎంసెట్ మొదటి, రెండో, తుది విడుత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారు ఈ నెల 12లోగా సంబంధిత కాలేజీల్లో టీసీలు సమర్పించి ప్రత్యక్ష్యంగా రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు.