TS EAMCET COUNSELING : నేటి నుండి తొలి విడత కౌన్సెలింగ్

హైదరాబాద్ (జూన్ – 26) : TELANGANA EAMCET 2023 COUNSELING తొలివిడత షెడ్యూల్ నేటి నుండి ప్రారంభం కానుంది.

జూన్ 26 నుంచి జూలై 5 వరకు ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి.

జూన్ 28 నుంచి జూలై 6 వరకు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి.

జూన్ 28 నుంచి జూలై 8 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి.

జూలై 12న సీట్ల కేటాయింపు జరపనున్నారు.

జూలై 12 నుంచి 19 మధ్య విద్యార్థులు సీటు పొందిన కళాశాలలో మరియు వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

TS EAMCET WEB COUNSELING WEBSITE