హైదరాబాద్ (సెప్టెంబర్ – 06) : TS EAMCET 2023 BPC STREAM COUNSELLING SCHEDULE లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTSAU)), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTSHU)(ములుగు, సిద్ధిపేట జిల్లా), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (PVNRTVU) లలో 2023 – 24 విద్యా సంవత్సరానికి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్, హైదరాబాద్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 11 నుండి 16వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుండి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది.
అభ్యర్థులు విద్యా సంబంధ సర్టిఫికెట్లు, క్యాస్ట్, ఆధార్ కార్డ్ మరియు ఎంసెట్ 2023 ర్యాంక్ కార్డును, హాల్ టికెట్లను తప్పనిసరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది.
మొదటి రోజు 352 ర్యాంకుతో కౌన్సిలింగ్ ప్రారంభమై… చివరి రోజు 12,989 ర్యాంకుతో ముగియనుంది.

బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హనర్స్ కమ్యూనిటీ సైన్స్,
బీఎస్సీ హనర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ సైన్స్, బిఎస్సి వెటర్నరీ సైన్స్ కోర్సులలో ప్రవేశాల కోసం ఈ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
★ వెబ్సైట్ : https://www.pjtsau.edu.in/