B.Pharmacy : సీట్ల కేటాయింపు పూర్తి, సెల్ప్ రిపోర్టింగ్ గడువు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 12) : TS EAMCET 2023 BPC STREAMING విభాగం పరీక్ష రాసిన అభ్యర్థులకు బీఫార్మసీ, డి ఫార్మసీ, బయోటెక్నాలజీ వంటి కోర్సుల్లో అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా మొదటి విడత సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 11న ముగిసింది. దాదాపు 97% సీట్లు ఈ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ అయ్యాయి.

మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 14వ తేదీ లోపు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టు చేయకుండా ఉంటే సీటు రద్దు అవుతుంది.

రెండో దశ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 23 నుండి 26వ తేదీ వరకు సీటు పొందిన కళాశాలలో విద్యార్హత సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

వెబ్సైట్ : https://tseamcetb.nic.in/Default.aspx