ఎంసెట్ హల్ టికెట్లు విడుదల – కన్వీనర్

తెలంగాణ ఎంసెట్ 2021 హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్‌ చేసుకొనేందుకు నేటి నుంచి ఈ నెల 31 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొ. గోవర్దన్ తెలిపారు.

బిట్‌శాట్, ఎంసెట్ ఒకే రోజు ఉన్న విద్యార్థులు సమాచారం ఇస్తే మరో రోజుకు మారుస్తామన్నారు.

ఇవాళ్టి వరకు ఇంజినీరింగ్‌ కోర్సులకు 1.63 లక్షలు, వ్యవసాయ, ఫార్మా కోర్సులకు 85,828 మంది విద్యార్థులతో కలిపి మొత్తంగా 2.49 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.

ఎంసెట్‌కు రూ.500 ఆలస్య రుసుముతో ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఆగస్టు 4 నుంచి 10 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

DOWNLOAD HALL TICKETS HERE