ఎంసెట్ 2021 పరీక్ష తేదీలు వెల్లడి

టీఎస్ ఎంసెట్ 2021 ద‌ర‌ఖాస్తు గ‌డువును కరోనా వ్యాప్తి నేపథ్యంలో మ‌రోసారి పొడిగించారు. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా జూన్ 10వ తేదీ వ‌ర‌కు ఆన్లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు అని ఎంసెట్ క‌న్వీన‌ర్ వెల్ల‌డించారు.

ఎంసెట్ పరీక్షలు జూలై 5 – 9 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT) మోడ్‌లో జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో జరుగుతాయి. అగ్రికల్చర్‌ వారికి 3, ఇంజినీరింగ్‌ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించాలనుకుంటున్నామని తెలిపారు.

ఎంసెట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతాయని కన్వీనర్ తెలిపారు.

Follow Us@