DOST గడువు రేపటి వరకు పెంపు.

తెలంగాణ లో డిగ్రీ ప్రవేశాల కోసం ప్ర‌వేశానికి ధృవీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించ‌డానికి మరియు కళాశాల యందు రిపోర్ట్ చేయడానికి చివ‌రి తేదీ ఈ రోజు తో ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువు ను రేపటి వరకు అనగా డిసెంబ‌ర్ 9వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీచేసింది.

పొడిగించ‌బ‌డింది. దోస్త్ ద్వారా డిగ్రీలో ప్ర‌వేశాలు పొందిన విద్యార్థులు, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు DOST కన్వీనర్ లింబాధ్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

దోస్త్ స్పెష‌ల్ డ్రైవ్ ద్వారా 14,247 మంది అభ్య‌ర్థులు ప్ర‌వేశాలు పొందారు. వివిధ ద‌శ‌ల్లో మొత్తం 28,136 మంది అభ్య‌ర్థులు ఆప‌న్లు ఇవ్వ‌గా వీరిలో 27,365 మందికి సీట్లు కేటాయించ‌బ‌డ్డాయి.

Follow Us@