CPGET 2023 : డిగ్రీ ఏదైనా ఎం.కామ్ లో చేరవచ్చు

హైదరాబాద్ (మే – 23) : డిగ్రీ ఏదైనా CPGET ప్రవేశ పరీక్ష ద్వారా ఎం.కాం.లో ప్రవేశం పొందవచ్చని TS CPGET 2023 కన్వీనర్ ప్రొ. పాండురంగారెడ్డి తెలిపారు.

ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంకాంలో ప్రవేశాలకు బీకాంతో పాటు బీఏ, బీఏ లిట్రేచర్స్, ఎలీల్బీ, బీఈడీ, బీపీఈడీ, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ఇతర డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు వివరించారు.

ఎంకాంలో ప్రవేశాలకు అన్ని డిగ్రీ లకూ అవకాశం కల్పించినందున టీఎస్ పీజీఈటీ- 2023 ఎంట్రన్స్ టెస్ట్ లో మార్పులు చేసినట్లు తెలిపారు. గతంలో మాదిరి పూర్తిగా కామర్స్ సబ్జెక్టు నుంచే ప్రశ్నలు కాకుండా, ఇతర అంశాల నుంచి కూడా 50 మార్కులకు ప్రశ్నలు ఇవ్వనున్నట్లు తెలిపారు.