హైదరాబాద్ (జూన్ – 24) : CPGET 2023 HALL TICKETS ను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.. తెలంగాణలోని 8 యూనివర్సిటీలతో పాటు అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం TS CPGET 2023 పరీక్ష నిర్వహించనున్నారు. సీపీగెట్-2023కు మొత్తం 69,498 మంది దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 30 సెంటర్లలో సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎగ్జామ్ ప్రారంభానికి అర గంట ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సీపీగెట్ కన్వీనర్ సూచించారు.
ఈ నెల 30 నుంచి జులై 10వ తేదీ వరకు ప్రతి రోజు మూడు సెషన్లలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి సెషన్ ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:30 గంటల వరకు, మూడో సెషన్ సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు.