TS CPGET 2023 : షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (మే – 01) : పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET – 2023 SCHEDULE) షెడ్యూల్ ను ఉస్మానియా యూనివర్సిటీ (O.U.) ఈరోజు విడుదల చేసింది.

పీజీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ లలో ప్రవేశ కోసం నిర్వహించే CPGET – 2023 మే 12 వ తారీకు నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఒక ప్రకటనలో ఉస్మానియా యూనివర్సిటీ తెలిపింది.

ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎమ్‌సీజే, ఎం.లైబ్రరీ. సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ తదితర మాస్టర్ డిగ్రీ కోర్సులు మరియు పీజీ డిప్లొమా కోర్సులు, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మ గాంధీ, తెలంగాణ, పాలమూరు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం మరియు జేఎన్టీయూ పరిధిలోని కళాశాలలో పీజీ ప్రవేశాలు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా కల్పించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో జరగనుంది.

◆ దరఖాస్తు విధానము :

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : మే – 12 – 2023

◆ దరఖాస్తు ముగింపు తేదీ : జూన్ – 11 – 2023

◆ 500/- ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు : జూన్ – 18 – 2023

◆ 2,000/- ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు : జూన్ – 20 – 2023

◆ పరీక్ష తేదీ : జూన్ చివరి వారం నుంచి

◆ వెబ్సైట్ : https://cpget.tsche.ac.in/CPGET/CPGET_HomePage.aspx