ఉన్నత విద్యలో కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ

తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యా పరిధిలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సంఘాలు తమ సమస్యలు పరిష్కారం, హక్కుల సాధన కొరకు ఏకతాటిపైకి వచ్చి జూనియర్ కాంట్రాక్టు లెక్చరర్ ల సంఘం అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రం నేతృత్వంలో డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్, పాలిటెక్నిక్ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ఉమా శంకర్ లు కలిసి కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ గా ఏర్పడ్డారు..

దీనితో ఉన్నత విద్యలో బలమైన శక్తిగా ఈ జేఏసీ తమ సమస్యలు, హక్కులు సాదించుకోవడానికి ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకున్నాయి.

కేసీఆర్ హమీ ప్రకారం విడుదలైన జీవో నంబర్ 16 ప్రకారం తమ సర్వీస్ క్రమబద్ధీకరణ ప్రథమ లక్ష్యంగా, ఉద్యోగ, ఆర్దిక, సామాజిక భద్రతలే ద్యేయంగా కలిసి పని చేయాలని తీర్మానం చేసుకున్నాయి.

ఇందులో భాగంగా JAC గౌరవ అధ్యక్షులు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సహకారంతో క్రమబద్ధీకరణకు అనుకూలంగా ఆర్థిక శాఖ నుండి హైకోర్టుకు ప్రభుత్వం నోట్ ఫైల్ పంపించడం జరిగింది.

క్రమబద్దీకరణ ఆలస్యం అయ్యే తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్నటువంటి కాంట్రాక్ట్ అధ్యపకులకు ప్రభుత్వ అండదండలతో ఉద్యోగ భద్రత కల్పించడానికి JAC కృషి చేస్తోంది.

రేషనలైసేషన్ పేరిట బదిలీలై బాధపడుతున్న డిగ్రీ కాంట్రాక్టు అధ్యపకులకు, బదిలీలు లేక బాధపడుతున్న జూనియర్ కాంట్రాక్టు అధ్యాపకుల బాధలను మన గౌరవ అధ్యక్షుడు హరీష్ రావు దృష్టికి తీసుకుపోయి సత్వరమే పరిష్కరించేలా JAC కృషి చేస్తోంది.

నెల నెలా వేతనాలు మరియు IT సమస్యలతో పాటు జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కలశాలలో ఏ ఇతర సమస్యలు ఉన్న హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తామమని, ప్రాథమిక సభ్యులకు న్యాయం జరిగే ప్రతి అంశంపై కలిసి పని చేస్తామని JAC చైర్మన్ సీహెచ్ కనకచంద్రం కో చైర్మన్ లు వినోడ్ కుమార్, ఉమ శంకర్ లు తెలిపారు.

Follow Us @