బదిలీ మార్గదర్శకాలు, ఇతర సమస్యల పై కమీషనర్ కు వినతి పత్రం ఇచ్చిన ఆర్జేడీ సంఘం.

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల తరపున ఆర్జేడీ అపాయింటెడ్ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి గాదె వెంకన్న, కుమార్ అద్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు లో ఇంటర్ విద్యా సెక్రటరీ ఉమర్ జలీల్ ని కలవడం జరిగింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సూచనల మేరకు కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు త్వరగా విడుదల చేసి బదిలీలు జరపాలని కొరారు.

అదేవిధంగా 20 సంవత్సరాల నుండి సంవత్సరానికి కేవలం 10 ఆర్జిత సెలవులు మరియు మహిళా అధ్యాపకురాళ్ళకు ప్రసూతి సెలవులు కేవలం 2 నెలలు వేతనం లేకుండా ఇవ్వడం జరుగుతుంది.

అయితే సీఎం కేసీఆర్ బదిలీలపై ప్రకటన చేసిన సందర్భంగా ఆర్జిత సెలవులు మరియు ప్రసూతి సెలవులు అమలు చేస్తున్నట్లు గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ విషయం పై తగిన చర్యలు తీసుకోని కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 22+5 ఆర్జిత సెలవులు మరియు మహిళా అధ్యాపకురాళ్ళకు వేతనంతో కూడిన 6 నెలల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని కోరడం జరిగింది, అలాగే పెండింగ్ ఉన్న వేతనాల గురించి కమీషనర్ ని అడగడం జరిగింది.

దీనిపై కమిషనర్ ఉమర్ జలీల్ బదిలీలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, అలాగే సెలవులకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతానని హమీ ఇవ్వడం జరిగింది. అలాగే వేతనాలకు సంబంధించిన ప్రోసిడింగ్ త్వరగా వచ్చేవిధంగా చూస్తామని కమీషనర్ తెలిపారు.

తెలంగాణ ఇంటర్ విద్యా కమీషనర్ ని కలిసిన వారిలో గాదె వెంకన్న, యార కూమర్‌,గోవర్ధన్, అంజనేయులు, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Follow Us@