కాంట్రాక్టు అధ్యాపకులు TDS పరిధిలోకి రారు – ఆర్జేడీ యూనియన్

కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఇప్పటికే నెల నెల జీతాలు రాక ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఇప్పుడు TAX పరిధిలోకి రాని కాంట్రాక్ట్ లెక్చరర్స్ జీతాల విషయంలో INCOME TAX నుండి DIEO ఆఫీసులకు వచ్చిన NOTICE లు ఆందోళన కలిగిస్తున్నాయ్..

ఈ సంవత్సరం ఆదాయ పన్ను శాఖ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO/NODAL OFFICER) కాంట్రాక్ట్ పద్దతిలో సేవలందిస్తున్న ఉద్యోగుల చెల్లిస్తున్న వేతనాలకు సంబంధించి 2019 – 2020 & 2020 – 2021 ఆర్థిక సంవత్సరాలకు యొక్క TDS విధింపుకు సంబంధించి లెక్కలు అడుగుతూ 194 J U/s 121 (1) & 121 (1A) 1961 ఆదాయపన్ను చట్టం ప్రకారం నోటీసులు పంపటం జరిగింది. అయితే 2019 – 20 మరియు 2020 – 21 ఆర్థిక సంస్థలకు సంబంధించి నెలకు 10 శాతం చొప్పున దాదాపు 44520/- రూపాయలు TDS చెల్లించాలని జిల్లా ఇంటర్విద్యా అధికారులు కాంట్రాక్ట్ అధ్యాపకులను ఆదేశిస్తున్నారని కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు…

కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులు నెలసరి వేతనం 37,100/- ఆదాయపన్ను శాఖ నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను పరిధి ప్రారంభం సంవత్సరానికి ఆదాయం 5 లక్షలు దాటితే పన్ను పరిధిలోకి వేతన జీవులు, వ్యాపారస్తులు, వ్యాపర సంస్థలు గాని వస్తారు. కానీ కాంట్రాక్టు అధ్యాపకుల 12 నెల వేతనం 4,45,200/- మాత్రమే కావున వీరు ఆదాయ పన్ను పరిధిలోకి రారు. కానీ ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వేతన జీవులు టిడిఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. సంబంధిత DDO లు TAN నెంబర్ మరియు DDO CODE తో FORM 16 ని ప్రతి సంవత్సరం పిబ్రవరి వేతన బిల్లుతో ఆదాయపు పన్ను శాఖకు ఈ పైలింగ్ సమర్పించాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టు అధ్యాపకులు వ్యక్తిగతంగా FORM 16 ని సమర్పించడంతో సంబంధించిన వేతనం కోసం విడుదలైన మొత్తం ఆదాయపు పన్ను శాఖా లెక్కలలోకి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సంబంధించిన జిల్లా ఇంటర్విద్యా అధికారులకు 194J ప్రకారం నోటీసులు రావడం జరిగింది.

సంబంధిత అధికారులు కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు ఇచ్చిన వేతనం మొత్తాన్ని ఆదాయ పన్ను పరిధిలోకి రాని కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు వేతనంగా ఇచ్చామని ఆదాయపన్ను శాఖకు పూర్తి వివరాలు తెలియజేయడం ద్వారా ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని చార్టెడ్ అకౌంటెట్లను సంప్రదిస్తే వారు చెప్తున్నారు.. ఇదే విషయాన్ని కమిషనర్ ఆఫీస్ అధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకుపోవడం జరిగింది. వారు కూడా ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్యని పరిష్కారం చూపుతాం అని హామీ ఇచ్చారు….

Income tax నుండి వచ్చిన notice ల విషయంలో కమిషనర్ అధికారులు TDS కట్టకుండా న్యాయం చేస్తారని ఆశిస్తూ వచ్చిన జీతాల బడ్జెట్ లాప్స్ కాకుండా ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం చూపుతారు అని ఆశిస్తున్నాం…. ఆర్జేడీ యూనియన్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమార్ లు తెలిపారు.

Follow Us@