సీజేఎల్స్ బదిలీలపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన యధాతథంగా…

16 – నవంబర్ – 2020

అర్హత కలిగివుండి, భర్తీకి అవకాశం వున్న ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయడానికి వెల్లదలుచుకున్న, జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.  

ఇవాళ ప్రగతిభవన్ లో సీఎం అధ్యక్షతన జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు ఎదుర్కుంటున్న సమస్యల మీద సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగరావు, సీఎం కార్యదర్శి శ్రీ రాజశేఖర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

జూనియర్ కాలేజీ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. వారిని రెగ్యలరైజ్ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నం కోర్టులో కేసుల వల్ల నిలిచిపోయింది. అయినా అంతటితో ఆగకుండా వారి నెల జీతాలను గతంలో కంటే రెట్టింపు చేసింది ప్రభుత్వం. సంవత్సర కాలానికి కేవలం పదినెలలు మాత్రమే జీతాలు చెల్లించే పరిస్థితి గతంలో వుండేది. తెలంగాణ ప్రభుత్వం దాన్ని పన్నెండు నెల్లకు పెంచి సంవత్సర కాలం పూర్తి జీతం ఇస్తున్నది. దాంతో పాటు వారికి సర్వీసు బెనిఫిట్స్ ను కూడా అందిస్తున్నం. సెలవులను పెంచినం. కాజువల్ లీవులు, మెటర్నిటీ లీవుల సదుపాయాలను కల్పించినం. ఇంక కూడా సాధ్యమైనంత మేరకు, నిబంధనలు అనుమతించిన మేరకు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది’’ అని సీఎం స్పష్టం చేశారు.

తమకు అనువైన మరో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలనే జూనియర్ కాలేజీ లెక్చరర్ల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని నియమ నిబంధనలను అన్ని కోణాల్లో పరిశీలించి, అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సీఎం విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Chief Minister Sri K. Chandrashekar Rao has decided to give an opportunity to the Contract Junior lecturers working in Government Junior Colleges who are eligible to work in the vacancies of other government junior colleges. The CM instructed the officials concerned to prepare guidelines in this regard.

The CM held a review meeting on Sunday at Pragathi Bhavan here on the problems of the contract lecturers working in the government junior colleges. Ministers Ms Sabita Indrareddy, Sri Puvvada Ajay Kumar, Rythu Bandhu Samithi State President Sri Palla Rajeshwar Reddy, Chief Secretary Sri Somesh Kumar, CM Principal Secretary Sri S Narsing Rao, Principal Secretary (Finance) Sri Ramakrishna Rao, CM Secretary Sri Rajasekhar Reddy and others participated.

Education Minister Ms Sabita Indrareddy, Sri Palla Rajeshwar Reddy brought to the notice of the CM about the problems faced by the contract lecturers in the government junior colleges. Speaking on the occasion, the CM said, “The state government has taken several measures about the junior college contract lecturers. The attempt to regularise them failed due to the cases in the court. The government has doubled their monthly salaries. In the past they were paid for 10 months in a year. The state government has increased it to 12 months with full pay. The government is also giving them the service benefits. We have increased their leaves and extended facilities like the Casual Leave and Maternity Leave. The government will take more measures for the welfare of these lecturers within the frame work of rules and regulations,” the CM clarified.

The CM instructed the officials to take into consideration the request from the contract junior lectures that they be given an opportunity to work in the government junior college of their choice in the vacant posts. He also instructed the senior officials of the education department to prepare the guidelines keeping in view the existing rules and regulations.

Follow Us @