కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు శుభవార్త.!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖలలో 50 వేలకు పైగా ఉద్యోగాలను ప్రత్యక్ష పద్ధతిలో నియామకాలు జరపడానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ శాఖల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి శాఖల వారీగా ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేయడానికి ఉన్న ఉద్యోగ ఖాళీలను వెంటనే నివేదిక రూపంలో అందించవలసిందిగా కోరడం జరిగింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ విద్య లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని శాంక్షన్డ్ పోస్టులలో దాదాపుగా 3,625 మంది కాంట్రాక్ట్ మరియు మినిమం టైం స్కేల్ పద్ధతిలో జూనియర్ లెక్చరర్ గా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

అయితే వీరి పోస్టులను ఖాళీగా చూపకుండా కేవలం పూర్తిగా ఖాళీగా ఉన్న దాదాపు 1,200 పోస్టులను మాత్రమే ఖాళీగా చూపడం ద్వారా కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల ఉద్యోగాలకు ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్ వలన ఎలాంటి ఇబ్బంది లేదని విశ్వసనీయ సమాచారం.

Follow Us@