బదిలీల విషయంలో కాంట్రాక్ట్ సంఘాలు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం – ఆర్జెడి కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అధ్యాపకులు 13 సంవత్సరాలుగా బదిలీలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంగా అనేక సందర్భాల్లో అధికారులను మరియు మంత్రులను కలిసి విన్నవించడం జరిగింది అయితే కాంట్రాక్టు అధ్యాపకుల విన్నపాన్ని మన్నించినటువంటి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మరియు పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బదిలీల విషయంలో సానుకూలంగా స్పందించేటట్లు చేసి ఆదేశాలు ఇప్పించడం జరిగింది.

సీఎం ఆదేశాలు ఇచ్చి రెండు నెలలు దాటినా కాంట్రాక్టు వ్యవస్థ లో ఉన్నటువంటి కొన్ని అంతర్గత మైనటువంటి మరియు అధికారుల యొక్క నిర్లక్ష్యానికి మార్గదర్శకాల విడుదలలో తీవ్రమైన జాప్యం జరిగింది. ఇదే విషయాన్ని మంత్రివర్యులు మరియు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయంలో కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలలో పరిష్కార మార్గంలో కాంట్రాక్ట్ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో సమస్య పరిష్కారం కోసం అన్ని సంఘాలు కలిసి ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని గాదె వెంకన్న, కుమార్ లు తెలిపారు..

6 తేదీన పళ్ళ గారి ఆధ్వర్యంలో బదిలీలు సాదిద్దాం. కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలలో విషయంలోనే కాకుండా నెలసరి వేతనాలు మరియు రెగ్యులర్ ఎంప్లాయిస్ మాదిరిగా పిఆర్సి మరియు తదితర విషయాలపై కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయాలని ఆర్జేడీ సంఘం తరపున విన్నపం.

Follow Us@