అతి త్వరలో బదిలీ మార్గదర్శకాలు – గాదె వెంకన్న

గత 13 సంవత్సరాలుగా బదిలీల కోసం ఇబ్బంది పడుతున్న కాంట్రాక్టు జూనియర్స్ అధ్యాపకుల బదిలీల సమస్య పై గత 4 సంవత్సరాలుగా ఆర్జేడీ సంఘం చేస్తున్న తీవ్ర ప్రయత్నం త్వరలో సఫలీకృతం కాబోతుందన సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమార్ లు ఒక ప్రకటనలో తెలిపారు.

సీఎం కేసీఆర్ నుంచి బదిలీ లపై ప్రకటన తీసుకురావడం దగ్గర్నుంచి, మహా క్షీరాభిషేకం కార్యక్రమం చేపట్టడం మరియు నిరంతరం అధికారులను మంత్రులను కలిసి సమస్య తీవ్రతను వారి దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా మార్గదర్శకాలు తీసుకురావడంతో ప్రయత్నాలు సఫలీకృతం కాబోతున్నాయని గాదె వెంకన్న తెలిపారు.

బదిలీ మార్గదర్శకాలపై మంత్రి ఇంద్రారెడ్డి ద్వారా ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ కి విన్నవించి బదిలీ మార్గదర్శకాలకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి చేసిన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యయాని తెలిపారు.

ఈ రోజు హైదరాబాద్ లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మరియు ఇంటర్మీడియట్ కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ను కలిసి బదిలీ మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరగా ఈ వారంలోనే బదిలీ మార్గదర్శకాలు విడుదల చేస్తామని కమీషనర్ హమీ ఇచ్చినట్లు గాదె వెంకన్న తెలిపారు.

Follow Us@