తరగతులు ప్రారంభం కాకముందే బదిలీలు జరపాలి.

కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల బదిలీల పై సీఎం ప్రకటన చేసిన దగ్గర నుండి బదిలీ మార్గదర్శకాల కోసం వేలాది మంది సీజేఎల్స్ ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్నా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ బదిలీలపై సీఎం నిర్ణయం తీసుకుని మార్గదర్శకాలను వెలువరించి ఇంటర్ విద్య కమిషనర్ కు సూచించిన దగ్గరనుంచి కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులు మార్గదర్శకాల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే సీఎం కేసీఆర్ బదిలీల పై ప్రకటన చేసి 20 రోజులు గడుస్తుండడం, మరోవైపు ఆప్ లైన్ తరగతులు ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతాయనే ఉహగానలతో బదిలీ మార్గదర్శకాలు ఇంకా వెలువడకపోవడంతో కొంత ఆందోళనలో సీజేఎల్స్ ఉన్నారు. భౌతిక తరగతులు ప్రారంభం కాకముందే బదిలీలు చేయడం వలన సమయం కలిసి వస్తుందని ఆప్ లైన్ తరగతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని కావునా వచ్చే వారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని పలువురి అభిప్రాయం.

అయితే సీఎం కేసీఆర్ నుంచి బదిలీల ప్రకటన వచ్చిన రెండు రోజులకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, ఎన్నికల కోడ్ రావడంతో బదిలీల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది, ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో విద్యా శాఖ మంత్రి అద్వర్యంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్ విద్యా కమీషనర్ తో సమావేశం ఏర్పాటు చేసి బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించి మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం నుండి అదేశాలు వచ్చిన వెంటనే బోర్డు మార్గదర్శకాలు విడుదల చేసి బదిలీల ప్రక్రియను పూర్తి చేయడానికి పూర్తి సిద్ధంగా ఉందని, మార్గదర్శకాల ఎర్పాటులో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని సమాచారం.

Follow Us@