బదిలీల పై సీఎం కేసీఆర్ ప్రకటనపై అధికారుల దొంగాట.?

సీఎం కేసీఆర్ స్వయంగా విద్యా శాఖ మంత్రి సుముఖంగా చేసిన ప్రకటన…

ముఖ్యమంత్రి కార్యాలయం తమ అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచిన ప్రకటన…

ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు వంటి అన్ని సమస్యలు జనవరి 31 లోగా పరిష్కారించాలని సీఎం కేసీఆర్ ప్రకటన…

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రతిరోజూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటనలు…

కేసీఆర్ హమీ ఇచ్చిన దగ్గర నుండి 80 రోజులుగా ప్రతిరోజు కాంట్రాక్టు అధ్యాపకులు విద్యా శాఖ అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు విన్నపాలు…

అయినా బదిలీల ప్రక్రియ ఒక అడుగు ముందుకు వందడుగులు వెనుకకు అన్నట్లు సాగుతోంది…

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు బదిలీ మార్గదర్శకాలు విడుదల కాకపోవడానికి కూడా అనేక కారణాలు…

బదిలీ మార్గదర్శకాలు విడుదల చేయడంలో ప్రభుత్వ పెద్దలు, ఉన్నత విద్యా శాఖ అధికారులు ఆడే దొంగాట…

మాకు సమాచారం లేదని ఒకసారి, మాకు ఆదేశాలు రాలేదని మరొక్కసారి, అసలు మీకు బదిలీలే లేవని ఇంకోసారి అధికారులు అధ్యాపకులతో ఆడుతున్న చెలగాటం…

మేము అధికారులకు అనేకమార్లు ఆదేశాలు ఇచ్చామని చెప్పే మంత్రి వర్యులు, ప్రభుత్వ పెద్దలు మరోవైపు…

ఇది ఆర్థిక సమస్య కాదు, కేవలం కుటుంబాలకు దగ్గరకు ఉద్యోగులను పంపి, వారిపై ఒత్తిడి తగ్గించి మరింత నాణ్యమైన పనిని రాబట్టుకునే అవకాశం…

చావనివ్వరు‌, బ్రతకనివ్వరు… జీవచ్చవంలా జీవిస్తూ, నరకయాతన అనుభవిస్తూ బ్రతకటమే ఈ 80 రోజులుగా బదిలీ బాధితుల బ్రతుకు…

విద్యా శాఖలోనే గురుకులాలు, కేజీబీవీలు, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు బదిలీలు కళ్ళ ముందే జరుగుతుంటే అధికారులకు కనిపించడం లేదా.?

సీఎం కేసీఆర్ ప్రకటన పై అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఆడుతున్న ఈ దొంగాటకు కారణం ఏమిటి.?

ఈ దోంగాటను వెనుక నుండి ఆడిస్తున్న ఆ సైంధవుడు ఎవడు.?

Follow Us@