సీజేఎల్స్ బదిలీలపై విద్యా శాఖ అధికారుల తీరుకు రాష్ట్ర వ్యాప్త నిరసన.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బదిలీలపై సీఎం ప్రకటన చేసి 75 రోజులు గడుస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోని విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ రోజు ఆర్జేడీ అపాయింటెడ్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భోజన విరామ సమయంలో అధికారుల తీరుపై నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసి 75 రోజులు గడచిన బదిలీ మార్గదర్శకాలను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్న అధికారులు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ రోజు బదిలీ బాధితులు అందరూ కళాశాల భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమారులు ఒక ప్రకటన విడుదల చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బదిలీ బాధితులు అందరూ ఈ నిరసన కార్యక్రమంలోపెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. బదిలీల ప్రక్రియ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధ్యంకాదని కావున ఈ బదిలీల ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ ప్రయత్నాలను విరమించమని, బదిలీలు ఈ సంవత్సరమే సాధించి తీరుతామని ఈ సందర్భంగా ప్రకటించారు.

Follow Us@