అధికారులతో మాట్లాడి బదిలీలు జరిపించండి – మంత్రితో కొప్పిశెట్టి

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు 13 ఏళ్ల బదిలీల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఈ రోజు హైదరాబాదులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని 475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన సురేష్మరియు శోభన్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా కమిషనర్ చెప్పిన అంశాలను వివరించారు. కమీషనర్ తన పరిధిలో ఉన్న 70 శాతం బదిలీలకు సంబంధించిన పని పూర్తయిందని. మిగిలిన అనుమతులు విద్యాశాఖ మంత్రి, చీఫ్ సెక్రటరీ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి రావాల్సి ఉందని వారి నుండి క్లియరెన్స్ రాగానే బదిలీల ప్రక్రియను చేపడతామని తెలిపారని మంత్రి కి వివరించగా… వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చినట్లు కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి సురేష్, శోభన్ తదితరులు పాల్గొన్నారు

Follow Us@