బదిలీల పై సీఎం హమీకి 50 రోజులు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల 13 సంవత్సరాలుగా బదిలీలు లేక కుటుంబాలకు వందల కిలోమీటర్ల దూరంలో పని చేస్తున్న నేపథ్యంలో మూడు సంవత్సరాల పోరాటాలు, వినతి పత్రాలు ఇచ్చిన తరువాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో బదిలీల సమస్య సీఎం దృష్టికి నవంబర్ 15న చేరింది. ఈ నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే బదిలీలకు మార్గదర్శకాలు తయారుచేసి బదిలీలు జరపాలని ఆదేశించిన విషయం విదితమే.

బదిలీల పై సీఎం కేసీఆర్ ప్రకటన చేసి 50 రోజులు గడుస్తున్నా కూడా బదిలీలపై విద్యాశాఖ వర్గాల నుండి సమాచారం కాని స్పష్టమైన ప్రకటన గాని ఇంతవరకు రాలేదు. ఈ నేపథ్యంలోనే బదిలీల మార్గదర్శకాలను త్వరగా విడుదల చేయాలని ఇంటర్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులు వేలాదిగా తరలివచ్చి డిసెంబర్ – 22న పాలాభిషేకం కార్యక్రమం జరిపారు. అయినా కూడా బదిలీ మార్గదర్శకాలపై ఇంకా స్పష్టమైన సమాచారం గాని ప్రకటన గాని విద్యా శాఖ వర్గాల నుండి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

సర్వీస్ రూల్స్ నింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీలు కమీషనర్ స్థాయిలో జరగాల్సిన అప్పటికీ స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించి 50 రోజులు గడుస్తున్నా కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు బదిలీలు జరుగుతాయో లేదో అనే విషయం గందరగోళానికి దారి తీస్తోంది.

కేవలం మూడు వేల ఆరు వందల మంది ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీల విషయంలోనే ఇంత తాత్సారం జరగడానికి ఏ కారణాలు అడ్డుపడుతున్నాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇతర డిపార్ట్మెంట్లో బదిలీలకు కోసం పోరాటాలు చేస్తుంటే ఇక్కడ సీఎం కేసీఆరే స్వయంగా హామీ ఇచ్చిన కూడా బదిలీలపై స్పష్టత లేకపోవడం కూడా విస్మయానికి గురిచేస్తోంది.

ఇంత తక్కువ సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల బదిలీలలో విషయం లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం భావించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆర్థిక భారం లేని ఈ సమస్య పరిష్కారానికి నెలలు పడితే, ఆర్థిక సంబంధిత సమస్యలు పరిష్కారం ఈ ప్రభుత్వంలో జరుగుతాయా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం బదిలీలు ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగాలి. కానీ కొంతమంది కుట్రపూరిత వ్యవహారాల వలన తాము పని చేసే స్థానం నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉన్న కొంత మంది కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బదిలీల ప్రక్రియను నిలుపుదల చేస్తున్నారని దానికి విద్యా శాఖ వర్గాలు తలోగ్గి మార్గదర్శకాలు విడుదలలో జాప్యం చేస్తున్నాయని బదిలీ బాధితులు పేర్కొన్నారు.

బదిలీలు అనేవి అందరికీ సమాన న్యాయం జరిగేలా జరపాలని కేవలం విల్లింగ్ బదిలీలు మాత్రమే చేయడం వలన చాలామంది బదిలీ బాధితులకు న్యాయం జరగదని ఇప్పటికే పదమూడు సంవత్సరాలు కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్నమనీ విల్లింగ్ బదిలీలు వల్ల అవకాశం రాకపోతే మళ్లీ బదిలీలు జరిగే వరకు మళ్లీ అదే కళాశాలలో కుటుంబాలకు దూరంగా పని చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని కావున ప్రభుత్వం వెంటనే బదిలీల ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నారు.

Follow Us@