బదిలీల కొరకు పల్లాను కలిసిన GCJLA 475 నాయకులు.

కాంట్రాక్టు ఒప్పంద అధ్యాపకుల బదిలీల పై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ఆమలు చేయాలని ఈరోజు MLC పళ్ళా రాజేశ్వర్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించిన 475 సంఘ నాయకులు.

కొప్పిశెట్టి సురేష్ ఆద్వర్యంలో బదిలీ భాదితుల తరపున యాదగిరిగుట్ట నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశామని అలాగే 475 సంఘము బదిలీల కొరకు చేసినా అనేక కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రి సమీక్ష చెసి సానుకూల నిర్ణయము తీసుకున్నందుకు సంతోషమని తెలిపారు. కానీ ముఖ్యమంత్రి ప్రకటన చేసి 45 రొజులు గడుస్తున్నా బదిలీలా మార్గదర్శకాలు ఇంకా విడుదల కాకపోవడముతో ఈ రొజు మరొసారి MLC పళ్ళా రాజేశ్వర్ రెడ్డిని 475 సంఘము నాయకులు కలిసి బదిలీల మార్గదర్శకాల విడుదల కొరకు కృషి చేసి, త్వరితగతిన పక్రియ పూర్తి చేయాలని కొరామని రాష్ట్ర 475 అసోషియోట్ ప్రెసిడెంట్ శోభన్ బాబు పల్లా కొరారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరలొ బదిలీలా మార్గదర్శకాలు విడుదల చేసి బదిలీలను వీలయినంత త్వరగా పూర్తి చేస్తామని హమీ ఇచ్చారని శోభన్ తెలిపారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన వారిలో స్టేట్ అసోషియోట్ ప్రెసిడెంట్ శోభన్ బాబు, మహిళా కార్యదర్శి సంగీత, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మనోహర్, వాజేడ్ కృష్ణ తదితరులు ఉన్నారు.

Follow Us@