బదిలీలు త్వరగా జరిపించండి – విద్యా శాఖ మంత్రితో కనక చంద్రం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల బదిలీలపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే బదిలీల మార్గదర్శకాలు విడుదల చేసి బదిలీలు త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం ఈరోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని మరియు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి విన్నవించడం జరిగింది.

ఇప్పటికీ పలు కారణాల వల్ల బదిలీల ప్రక్రియ ఆలస్యమైందని కావునా వెంటనే బదిలీలు చేపట్టాలని ఈ సందర్భంగా కనక చంద్రం పేర్కొన్నారు.

దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వీలైనంత త్వరగా బదిలీ మార్గదర్శకాలు విడుదల చేసి బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం జిల్లా నాయకులు సిరిసిల్ల శ్రీనివాస్, జిల్లా నరసింహ, మాలతి, జల్లెల శ్రీను, విష్ణు కుమార్, కడారి శ్రీనివాస్, కటయ్య తదితరులు పాల్గొన్నారు

Follow Us@