రేపటి పల్లాతో భేటీ పై కోటి ఆశలతో, వేయి కళ్ళతో బదిలీ బాధితుల ఎదురు చూపు.

కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల బదిలీలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసి రెండు నెలలు దాటుతున్న ఇంతవరకు బదిలీల మార్గదర్శకాలు విడుదల కానీ విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఈ విషయం మీద చర్చించేందుకు రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల సకల సంఘాల అధ్యక్షులు కలిసి బదిలీల సమస్య పై చర్చించనున్నారు.

ముఖ్యంగా 3 సంఘాల మధ్య ఏకాభిప్రాయం లేక బదిలీల ప్రక్రియ నిలిచిపోయిందని వార్తల నేపథ్యంలో బదిలీ బాధితుల పక్షాన మూడు సంఘాలు కలిసి సీఎం కేసీఆర్ నుండి బదిలీల ప్రకటన ఇప్పించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు సంఘాలు తెలిపాయి.

వీలైనంత త్వరగా బదిలీలు మార్గదర్శకాలు విడుదల చేసి బదిలీల ప్రక్రియను పూర్తి చేసి 13 సంవత్సరాల బదిలీ బాధితుల గోడును తీర్చవలసిందిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బదిలీ బాధితులు వేడుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పల్లా తో కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల భేటి పై వేలాది మంది బదిలీ బాధితులు ముఖ్యంగా వందలాది కిలోమీటర్ల దూరంలో కుటుంబాలకు దూరంగా ఉన్న మహీళా అధ్యాపకురాళ్ళు కోటి ఆశలతో వెయ్యి కళ్ళతో గత నాలుగైదు రోజుల నుండి ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ భేటి ఉత్కంఠ రేపుతోంది. ఈ సమావేశం తర్వాత అయినా బదిలీలు జరుగుతాయా లేదా ఇంకా ఏమైనా కొర్రీలు పెడతారా అనే సందేహం పలువురు సీజేఎల్స్ వ్యక్తం చేస్తున్నారు.

Follow Us@