కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితం విచారకరం – డాక్టర్ కొప్పిశెట్టి

కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలపై ఇటీవల నల్గొండ కాంట్రాక్టు లెక్చరర్ల ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు అర్ధరహితం, విచారకరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా ,సంఘం పరంగా చాలా గౌరవిస్తామని, 2014 నుంచి కాంట్రాక్టు లెక్చరర్లు నిర్వహించిన సమావేశాలకు మరియు అధికారులు, ముఖ్యమంత్రి దగ్గరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకు వెళ్లడంలో అనేకసార్లు సహాయం చేయడం జరిగిందని, ఇందుకు మా సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ,గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలపై సంఘాలుగా, వ్యక్తులుగా, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని కలిసి అనేక సార్లు విన్నవించడం జరిగింది,చివరగా ఫలితం రాకపోవడంతో బదిలీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడానికి అక్టోబర్ 30 మరియు నవంబర్ 1 2020 సంవత్సరం “యాదాద్రి నుండి హైదరాబాద్ “వరకు పాదయాత్ర నిర్వహిస్తామని పది రోజుల ముందుగానే డాక్టర్ పల్లా గారికి మరియు ప్రభుత్వానికి ఇంటర్ విద్యాధికార్లకు తెలియజేసి, పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొని అనేక సంఘాలు వ్యక్తుల మద్దతుతో పాదయాత్ర నిర్వహించి, గౌరవ విద్యాశాఖ మంత్రిగారిని, అధికార్లను కలిసి వివరించడం జరిగింది,

అనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ లెక్చరర్ల బదిలీలపై నవంబర్ 15న స్పందించడంతో గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలకమైన పాత్ర వహించడం జరిగిందని ,ఈ నేపథ్యంలో ప్రభుత్వం బదిలీల మార్గదర్శకాలు ఎలాంటివైనా సంతోషిస్తామని మేము మా సంఘం నుంచి రాతపూర్వకంగా అనేకసార్లు అధికారులకు మరియు విద్యాశాఖ మంత్రి ని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది,

2021 జనవరి 4 నాడు నూతన సంవత్సరం సందర్భంగా డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో ఈ విషయాన్ని మరొకసారి తెలియ చేయగా, వెంటనే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారులకు ఫోన్ ద్వారా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరడం జరిగిందని తెలిపారు, కానీ ఇంతవరకూ మార్గదర్శకాలు రాకపోగా 3 సంఘాలు కలిసి మార్గదర్శకాలు తయారు చేయాలని కోరడం, సమస్యను పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వము అధికారుల తప్పును సంఘాలపై నెట్టడం సరియైనది కాదని, గతంలో అనేక సమస్యలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో సంఘాలతో సంబంధం లేకుండా రావటం జరిగిందని, మరి ప్రభుత్వానికి” పైసా ఖర్చు” కానీ బదిలీలపై సంఘాలు మార్గదర్శకాలు తయారు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందని తెలిపారు.

మార్గదర్శకాల నిబంధన ప్రభుత్వ అధికారులు తయారు చేయాలి, సంఘాలు వినతిపత్రం మాత్రమే ఇస్తాయి, సంఘాలు ఇచ్చే వినతిపత్రాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏమి చేయాలి అనుకుంటే అదే చేస్తుందని తెలుపుతూ, ఇప్పటికైనా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం పై డాక్టర్ పల్లా గారు స్పందించాలని, వారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి మా సంఘం సిద్ధంగా ఉన్నదని, ఈ విషయాన్ని డాక్టర్ పల్లా గారికి తెలుపుతూ, అదేవిధంగా క్రమబద్ధీకరణ జీవో నెంబర్ 16 పై న్యాయస్థానాల కు సంబంధించిన విషయాలను మరియు నెలనెలా వేతనాలు పై గతంలో అనేక సార్లు డాక్టర్ పల్లా గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, అని తెలుపుతూ ఈ సమస్య పరిష్కారం లో డాక్టర్ పల్లా గారు సహకరిస్తారని నమ్మకం ఉందని తెలియజేశారు.

డాక్టర్ పల్లా గారు ఇప్పటికైనా బదిలీల సమస్యను సంఘాల పై నెట్టి వేయకుండా చొరవ చూపించి ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చినా సంతోషిస్తామని తెలియజేయడం జరిగింది, అదేవిధంగా కాంట్రాక్ట్స్ లెక్చరర్స్ మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి బదిలీల మార్గదర్శకాల విషయంలో ప్రభుత్వము చేయదలుచుకుంటే ఆపే శక్తి ఎవరికీ లేదని, రాష్ట్రంలో పిఆర్సి& మరియు సిపిఎస్ విషయంలో అనేక సంఘాలు ఉద్యమాలు, వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఏమి చేస్తుందో గమనించాలని కోరారు.

Follow Us@