బదిలీల పై ఆందోళన వద్దు – TIPS

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలపై ముఖ్యమంత్రి,  విద్యాశాఖ మంత్రి సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు TIPS తరపున జంగయ్య, రామకృష్ణ గౌడ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

త్వరలో జరగబోవు కాంట్రాక్టు అధ్యాపక మిత్రుల బదిలీలు(స్థానచలనం) పై  ఎలాంటి “ఆందోళన” చెందాల్సిన అవసరం లేదు – “తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి”(TIPS)

అయితే అధికారికంగా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎలాంటి నియమ నిబంధనలు సూచిస్తూ ఉత్తర్వులు రాలేదు. కావున కాంట్రాక్ట్ అధ్యాపకులు అనవసరంగా “ఆందోళన” చెందవలసిన అవసరం లేదని, ప్రస్తుతం సోషల్ మీడియా లో జరుగుతున్న అవాస్తవ, అనవసర చర్చలు చేస్తూ కొందరు బదిలీలు ఆపే కుట్రలను మీరు నమ్మవద్దు మరొకసారి మోసపోవద్దని TIPS తరపున విజ్ఞప్తి చేశారు.  

ప్రభుత్వము బదిలీలపై  విధివిధానాలను  రూపొందించే క్రమంలో మన విజ్ఞప్తికి ఇంటర్ విద్యా కమిషనర్ ఉమర్ జలీల్ స్పందిస్తూ “తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి” (TIPS) యొక్క అభిప్రాయాలు, సూచనలు ఏమైనా ఉంటే మంగళవారం సాయంత్రం వరకు కమీషనర్  కార్యాలయంలో అందజేయవలసినదిగా కోరారు కావునా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల అందరికి అమోదయోగ్యమైన సూచనలను చేయనున్నాము.

కొన్ని కారణాల చేత గత 13 సంవత్సరాలుగా కాంట్రాక్టు అధ్యాపకుల స్థానచలనం ( బదిలీల) జరగకపోవడం వలన వారు మరియు వారి  కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న అన్ని రకాల సమస్యలను దృష్టిలో ఉంచుకొని నియమ నిబంధనలను బోర్డు రూపొందిస్తుందని ఆశిస్తూ ఆ నిబంధనలు కాంట్రాక్టు అధ్యాపక మిత్రుల కష్టాలు తీర్చేవి గా న్యాయంగా, పారదర్శకంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ప్రభుత్వం నుండి బదిలీల (స్థానచలనం) నియమ నిబంధనలు వచ్చిన తర్వాత వాటిని అధ్యయనం చేసి ఏమైనా సందేహాలు ఉంటే అప్పుడు (TIPS)తరపున  స్పందిస్తాం అంత వరకు మిత్రులు సహనం పాటించి సహకరించాలని TIPS తరపున  జంగయ్య, రామకృష్ణ గౌడ్, శేఖర్,  కొప్పిశెట్టి సురేష్, గాదె వెంకన్న, నగేష్, రహీమ్ తెలిపారు.

Follow Us@