ఉద్యోగ క్రమబద్ధీకరణ హమీ అమలెప్పుడు.?

 తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రతి మీటింగులో హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 2014 సార్వత్రిక ఎన్నికలలో టిఆర్ఎస్ మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఒక అంశంగా చేర్చడం జరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఎన్నిక కాబడిన తర్వాత జరిగిన మొదటి కేబినెట్ లోనే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అంశాన్ని చేర్చి కేబినెట్ అమోదం కూడా లబించింది.  

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లో ఉన్న లోతుపాతులను అధ్యయనం చేయడానికి   రాజీవ్ శర్మ నేతృత్వంలో ఐఏఎస్ ల కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ రిపోర్టు ప్రకారం జీవో నెంబర్ 16 ను తీసుకు రావడం జరిగింది.  ఈ లోపల జీవో నెంబర్ 16 కి వ్యతిరేకంగా హైకోర్టులో నక్కల గోవింద్ రెడ్డి  పిల్ (WP122/2017) వేయడం జరిగింది. దానితో జీవో నెంబర్ 16 తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

● జీవో నంబర్ – 16 మీద ఉన్న కేసును వెంటనే వెకేట్ చేయించాలి :

ఈ పిల్ మీద వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాలు ఇంప్లీడ్ కావడం కూడా జరిగింది, కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల  అనేక ఒత్తిళ్ల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలు చేసింది.   ఈ కేసు దాదాపుగా మూడు సంవత్సరాలుగా అనేక వాయిదాలు  పడుతూనే ఉంది.

 జీవో నెంబర్ 16 మీద ఉన్న పిల్ ను సాద్యమైనంత త్వరగా వెకెట్ చేయిస్తే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధ్యమవుతుంది. కానీ ఇది హైకోర్టులోనే గత మూడు సంవత్సరాలుగా వాయిదాలు పడుతూ ఉంది. 

అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం అనుమతితో ఈ కేసులో వాదనలు వినిపించాల్సి ఉంది, కానీ ప్రభుత్వం నుండి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. 

● ఆర్థిక భారం లేని సమస్యల పరిస్థితి అంతే ::

ముఖ్యమంత్రి కేసీఆర్  అనేక సభల్లో ఇచ్చిన క్రమబద్ధీకరణ అటకెక్కిన సంగతి తెలిసింది. అయినప్పటికీ ఇతర అనేక నాన్ పైనాన్షియల్ సమస్యలు అయినా క్యాజువల్ లీవ్ లు, మెటర్నటీ లీవ్, బదిలీలు వంటి అంశాలు కూడా పరిష్కారానికి నోచుకోకపోవవడం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దయనీయ స్థితికి అద్దం పడుతుంది.

కావునా ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలు కోరుతున్నాయి.

క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆలస్యం కావడంతో అనేక మంది ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతూ రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి బెనిఫిట్ లేక తీవ్ర ఆర్థిక, మానసిక క్షోభకు గురవుతున్న విషయం విదితమే. కావున తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా హైకోర్టులో ఉన్న కేసును చేపించి జీవో నెంబర్ 16 ప్రకారం ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు కోరుకుంటున్నారు.

● కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి :

గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్ కళాశాలను నిలబెడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. 

తమ చిరకాల వాంఛ క్రమబద్ధీకరణ తెలంగాణ రాకతో నేరవేరుతుందని ఎన్నో ఆశలతో తెలంగాణ ఉద్యమంలో  భాగస్వాములుగా మారి, తెలంగాణ సాదనలో తమ పాత్ర పోషించారు. అయినప్పటికీ ఈ సమస్య కేసీఆర్ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చిన  ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది.


ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వాలు కాంట్రాక్ట్ & అవుట్సోర్సింగ్ అనే విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగుల శ్రమదోపిడీకి చట్టబద్ధత కల్పించారు. ఈ విధానం ద్వారా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వారి ఆర్థిక అవసరాలనను అసరాగా చేసుకుని తక్కువ జీతాలకే నియమించుకున్నారు. తద్వారా  వారి జీవితానికి సెక్యూరిటీ లేకుండా అనిశ్చితి కల్పించారు. ఈ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ వీరి నియామకాలలో రిజర్వేషన్లు అమలు చేయలేదని,  నియామక పద్ధతులు చట్టబద్ధంగా లేవని నియమించుకున్న వారే క్రమబద్ధీకరణను  అడ్డుకుంటున్నారు. కావున ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించి ఈ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలి. 

● డా. అందె. సత్యం – తెలంగాణ ఉన్నత విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపుగా 3,700 మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడిగా ఇచ్చిన హమీ మేరకు అందరినీ క్రమబద్ధీకరించాలి, దాని కోసం జీవో నంబర్ 16 మీద  కోర్ట్ లో ఉన్న కేసు ను వెకేట్ చేపించాలి.    

● కొప్పిశెట్టి  సురేష్ 475 . అససోషియోషన్ కార్యదర్శి.


Follow Us@