29 న తెలంగాణ మంత్రిమండలి భేటి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 26) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సెప్టెంబర్ 29న రాష్ట్ర మంత్రివర్గం బేటి కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలకు మోక్షం లభించే అవకాశం ఉంది.

అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పథకాలకు మోక్షం లభించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులకు రెండో పిఆర్‌సి ఏర్పాటు, ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది.

రెండవ పిఆర్సి, ఐఆర్ ల పై ఇప్పటికే శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళిసై తిరస్కరించిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.