TS CABINATE – తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

BIKKI NEWS (FEB. 04) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను (TS CABINATE DECISSIONS) తీసుకుంది.

ముఖ్యంగా ఆరు హామీలలో భాగంగా ఇచ్చిన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు మరియు గ్యాస్ సిలిండర్ 500/- రూపాయలకే అందించే పథకానికి ఆమోదం తెలిపింది. వీటిని అసెంబ్లీ సమావేశాల తర్వాత అమలు చేయనున్నారు.

అలాగే TS బదులు TG పదాన్ని వాహనాల నెంబర్ ప్లేట్లపై వాడాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

అలాగే అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ పాటను తెలంగాణ గేయంగా ప్రకటించింది.

ఫిబ్రవరి 8వ తేదీ నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

తెలంగాణరాష్ట్రంలో కుల గణన కు కేబినెట్ ఆమోదం.

ఖైదీలకు క్షమాభిక్ష కు కేబినెట్ నిర్ణయం

ప్రభుత్వ ఐటీఐ కళాశాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లు గా ఉన్నతీకరణ. నూతన కోర్సుల ఏర్పాటు.

ఉచిత బస్ ప్రయాణం ద్వారా 14 25 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ప్రయాణం

త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ లు. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ

తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ చిహ్నం లో మార్పులు చేయడానికి నిర్ణయం

కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు కు నిర్ణయం.

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కు 100 ఎకరాల కేటాయింపు కు కేబినేట్ అమోదం.

నిజాం షుగర్ ప్యాక్టరీ పునరుద్ధరణ కు చర్యలు