హైదరబాద్ (డిసెంబర్ – 10) : తెలంగాణ పోలీస్ శాఖలో కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. కొత్తగా 3,966 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది.
సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయాలని, నియామకానికి చర్యలు చేపట్టాలని హోంశాఖను కేబినెట్ ఆదేశించింది.
కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. డ్రగ్స్ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.