బీసీ విదేశీ విద్య పథకానికి దరఖాస్తుల ఆహ్వనం

హైదరబాద్ (జనవరి – 26) : మహాత్మా జ్యోతిబాపూలె బీసీ విదేశీ విద్య పథకానికి ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

విదేశాల్లో పీజీ చదివేందుకు ఈ పథకం కింద అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జులై 1 నాటికి వయసు 35 ఏళ్ల దాటకూడదని, కుటుంబ వార్షికాదాయం రూ. 5 లక్షల్లోపు ఉండి, డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించాలని పేర్కొన్నారు.

వెబ్సైట్ : https://telanganaepass.cgg.gov.in/