హైదరాబాద్ (మే – 06) : మహత్మ జ్యోతిభా పూలే బీసీ గురుకులాల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశపరీక్ష హాల్ టికెట్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.
మే 10న ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 295 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రాత పరీక్షకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు మల్లయ్య భట్టు చెప్పారు.