ప్రధాన కార్యదర్శి చేతిలో పీఆర్సీ నివేదిక.

2018వ సంవత్సరం మే నెలలో నియమించిన 11 పిఆర్సీ కమిటీ బిశ్వాల్ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో నియమించడం జరిగింది. ఈ కమిటీ గడువును పలుసార్లు పొడిగించడం జరిగింది. చివరికి 2020 డిసెంబర్ 31వ తేదీన తన తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు అందజేశారు.

అయితే ఈ రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ టీఎన్జీవో టీజీవో సంఘం నేతలతో సమావేశమై ఉద్యోగుల పలు అంశాలపై చర్చించడం జరిగింది.

అయితే పీఆర్సీ నివేదిక స్వీకరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగుల సమస్యలు, నియామకాలు అంశంపై సోమేష్ కుమార్ నేతృత్వంలోనే ఎర్పడిన త్రిసభ్య కమిటీ పీఆర్సీ నివేదికను వారం రోజుల పాటు పరిశీలించినున్నది.

ఈ నేపథ్యంలోనే జనవరి మొదటి వారంలో ఉపాధ్యాయ సంఘాలతో సీఎం భేటీ కావడం, మరొక్కసారి ఉద్యోగ సంఘాలతో జనవరి రెండో వారంలో సీఎం కేసీఆర్ భేటీ కావడం అనంతరం జనవరి మూడవ వారంలో పిఆర్సి నివేదికను వెలువరించే అవకాశం ఉంది.

Follow Us@