సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీలకు షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (మే 21) : తెలంగాణ రాష్ట్రంలోని సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగులైన డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, ఐఈఆర్పీలు, సిస్టం అనలిస్టులు, అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్లు బదిలీ కానున్నారు.

బదిలీ దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శనివారం విడుదల చేశారు. ఈ నెల 23 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బదిలీల ప్రక్రియ ఆన్లైన్ లో నిర్వహిస్తామని, పూర్తి మార్గదర్శకాలను వెబ్సైట్ లో పొందుపరిచినట్టు వెల్లడించారు.

◆ వెబ్సైట్ : https://schooledu.telangana.gov.in/ISMS/