ఒడిశా (జూన్ – 02) : ఒడిశా లో షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బాలసోర్ సమీపంలో ఆగిఉన్న గూడ్స్ ట్రైన్ ని డీకోట్టి పట్టాలు తప్పి ఘోర ప్రమాదం జరిగింది. అదే సమయంలో అటునుంచి వస్తున్న యశ్వంత్ పుర – హౌరా ట్రైన్ డీకొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. సహాయ చర్యలు చేపట్టారు.
సమాచారం ప్రకారం 50 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్లు, 300 పైగా గాయపడినట్లు సమాచారం. రాష్ట్రపతి, ప్రధాని, నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఒడిశా ప్రమాదానికి సంబంధించిన సహాయ కోసం ఎమర్జెన్సీ నంబర్లు విడుదల చేసింది.
- HWH: 03326382217
- KGP: 8972073925, 9332392339
- BLS: 8249591559, 7978418322
- SHM: 9903370746