BIKKI NEWS (MARCH 10) : Traffic alert in uppal junction on 11th march 2025. తేదీ 11 మార్చి 2025 రోజున ఉదయం 8 గంటలకు గౌరవనీయులు తెలంగాణ గవర్నర్ గారు హైదరాబాదు నుండి ములుగు వెళుతున్నందున, రోడ్డుపై వెళ్ళు ట్రాఫిక్ కు జంక్షన్ లో కొంత నిరోధించబడవచ్చు.
Traffic alert in uppal junction on 11th march 2025
ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కు వెళ్ళు విద్యార్థులకు, మరియు వారి పేరెంట్స్ కు ముఖ్యంగా తెలియజేయునది ఏమనగా ఉదయం 8:30 గంటల లోపు ఎగ్జామినేషన్ సెంటర్ కు చేరుకుంటారని, ఆలస్యంగా బయలుదేరి కూడళ్ళలో ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బందులకు గురికాకుండా ఉండడానికి ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగా సమాచారం అందించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
మార్చి 11వ తేదీన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ – 1A, బోటని మరియు పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9.00 గంటలకు ప్రారంభం అవుతాయి.. విద్యార్థులు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ తో కలిపి 09.05 గంటల వరకు వరకు పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చు. తదనంతరం విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు.
కావున విద్యార్థులు ట్రాపిక్ ఆంక్షలు దృష్టిలో పెట్టుకుని ఉదయం 8.30 లోపల, వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ట్రాపిక్ పోలీసులు ప్రకటించారు