హైదరాబాద్ (ఏప్రిల్ 29) : తెలంగాణ రాష్ట్రంలోని నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం అవసరమైన ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (IELTS), నేషనల్ కౌన్సిల్ లైసెన్సెర్ ఎగ్జామినేషన్ (NCLEX) ల మీద నెల పాటు నిర్వహించే శిక్షణ మేలో ప్రారంభించనున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) తెలిపింది.
ఆసక్తి ఉన్నవారు 7901290580, 9502894238 సంప్రదించాలని సూచించింది. శిక్షణా వివరాలను TOMCOM యాప్, వెబ్సైట్ లలో పొందుపరుస్తామని వెల్లడించింది.
ఈ శిక్షణ పూర్తిచేసిన అర్హులైన అభ్యర్థులకు అమెరికా, యూకే, కెనడాలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని TOMCOM తెలిపింది.