TOMCOM JOBS : విదేశాల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 28) : తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOM COM) ఆధ్వర్యంలో UAE లో పలు ఉద్యోగాలకు, మలేసియాలో టెక్నికల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు ఎప్రిల్‌ 29న ఎన్‌రొల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

నాన్ హెల్త్ కేటగిరీలోని ఈ ఉద్యోగాలకు విజయనగర్ కాలనీలోని మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్ లోని TOMCOM కార్యాలయంలో డ్రైవ్ కొనసాగనుంది.

యూఏఈలో బ్లాస్టర్ పెయింటర్, క్లీనర్, జనరల్ హెల్పర్, ఫోర్మెన్, బ్లాస్టింగ్ పెయింటింగ్, ఫోర్మెన్ ప్లాటర్, ఎఫ్సీఏడబ్ల్యూ వెల్డర్, జీటీఏడబ్ల్యూ వెల్డర్, ఐటీవీ డ్రైవర్, మిషినిస్ట్, సీఎస్సీ, పైప్ ఫిట్టర్, ప్లాటర్ ఫ్యాబ్రికేటర్, స్కాఫోల్డర్స్ పోస్టులున్నాయి.

ఈ ఉద్యోగాలకు తగిన అనుభవంతో పాటు రెండేళ్లపాటు చెల్లుబాటయ్యేలా పాస్ పోర్టు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నియామక ఏజెన్సీ భోజనం, వసతి, టికెట్లు అందిస్తుంది. అర్హు లు టామ్కామ్ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ వెబ్సైట్ : https://tomcom.telangana.gov.in/