టోక్యో పారాలింపిక్స్‌ నిషాద్ కుమార్ కు రజతం

టోక్యో పారాలింపిక్స్‌ 2020 లో ఇండియా ఖాతాలో రెండో సిల్వ‌ర్ మెడ‌ల్ చేరింది. పురుషుల హైజంప్ టీ47 ఫైన‌ల్లో ఇండియాకు చెందిన నిషాద్ కుమార్ సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచుకున్నాడు. ఫైన‌ల్లో త‌న అత్యుత్త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న అయిన 2.06 మీట‌ర్ల ఎత్తు దూకిన నిషాద్‌.. ర‌జ‌త ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు.

తొలి ప్ర‌య‌త్నంలో విఫ‌ల‌మైనా రెండో ప్ర‌య‌త్నంలో సాధించాడు. ఈ పథకం తో టోక్యో పారాలింపిక్స్‌లో భార‌త్ ప‌త‌కాల సంఖ్య రెండుకి చేరింది.

Follow Us @