టోక్యో పారాలంపిక్స్ లో పతకాల పంట

టోక్యో పారాలంపిక్స్ లో శుక్రవారం ఒక్కరోజే భారత్ క్రీడాకారుల బృందం 3 పతకాలను సాధించింది. ఇందులో రెండు కాంస్య పతకాలు, ఒక రజత పతకం ఉన్నది. దీనితో భారత్ సాదించిన పతకాల సంఖ్య 13 కి చేరింది.

ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణపతకం సాధించిన అవని లేఖరా 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఒకే పారాలంపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మహిళగా రికార్డు సృష్టించింది.

హై జంప్ లో ప్రవీణ్ కుమార్ ఆసియా రికార్డు నెలకొల్పుతూ రజత పతకాన్ని సాధించాడు.

మరోవైపు హర్వీందర్ సింగ్ అర్చరీ విబాగంలో కాంస్య పతకం సాదించాడు.