టోక్యో పారాలింపిక్స్‌ లో భవీనాబెన్ పటేల్ కు రజత పతకం

టోక్యో పారాలింపిక్స్‌ 2020 లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయ‌ర్‌ భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించింది. చైనా ప్లేయర్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ సీడ్‌ యింగ్‌ జావోతో జరిగిన ఫైన‌ల్‌ పోరులో 3-0తో ఓటమిపాలయింది. పారాలింపిక్స్‌ చరిత్రలో టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కి పతకం దక్కడం ఇదే మొదటిసారి.

గుజరాత్‌కి చెందిన భవీనాబెన్‌ పటేల్ పోలియో కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. మొత్తంగా పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత రెండో అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించింది. 2016లో దీపా మాలిక్ రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.

Follow Us @