టోక్యో ఒలింపిక్స్‌ – 2020 లో తొలి పథకం సాదించిన భారత్

టోక్యో ఒలింపిక్స్‌ – 2020 లో తొలి రోజు వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచింది. దీంతో ఇండియా ప‌త‌కాల వేట మొదలైంది.

2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో మెడ‌ల్ గెలిచిన తొలి అథ్లెట్‌గా మీరాబాయ్ నిలిచింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో మన తెలుగు తేజం క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ్రాంజ్ మెడ‌ల్ గెల‌వ‌గా.. ఇప్పుడు మీరాబాయ్ సిల్వ‌ర్‌తో మెరిసింది.

స్నాచ్‌, క్లీన్ అండ్ జెర్క్ క‌లిపి ఆమె 202 కేజీల బ‌రువు ఎత్తింది. గోల్డ్ కోసం క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయ్ చివ‌రి ప్ర‌య‌త్నంలో 117 కేజీల బ‌రువు ఎత్త‌డానికి ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైంది.

Follow Us @