RBI – మానీటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు

BIKKI NEWS (APR. 09) : TODAY RBI MONITORY POLICY DECISIONS. ఆర్బిఐ తాజా ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకుంది.

TODAY RBI MONITORY POLICY DECISIONS

ముఖ్యంగా రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వరుసగా రెండోసారి వడ్డీరేట్లు తగ్గించినట్లయింది.

ప్రస్తుతం 6.25% గా ఉన్న రెపో రేటు తాజా తగ్గింపుతో 6 శాతానికి చేరింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేట్లు తగ్గి ఈఎంఐ భారం తగ్గనుంది.

ఏప్రిల్ 04 నాటికి భారత్ లో విదేశీ మారక నిల్వలు 676 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

ద్రవ్యోల్బణం 4 శాతానికి పరిమితం అవుతుందని ఆర్బిఐ అంచనా వేసింది.

2025 – 26 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు 6.5% గా నమోదు కావచ్చని ఆర్బిఐ అంచనా వేసింది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా వాణిజ్య వృద్ధిరేటు తగ్గి దాని ప్రభావం కారణంగా జిడిపి వృద్ధిరేటు తగ్గొచ్చని ఆర్బిఐ అంచనా వేసింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు